Home ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై త్రినేత్రం

ఎన్నికలపై త్రినేత్రం

0

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, మార్చి28: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వరుగా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.పి.ఎస్. అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వరుగా మరియు 1983 బ్యాక్ కి చెందిన రిటైర్డు ఐ.ఆర్.ఎస్. అధికారి నీనా నిగమ్ ను ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు గా నియమించినట్లు ఇ.సి.ఐ. నుండి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు.

ఈ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు నేడు భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవుతున్నారన్నారు.

ఈ ముగ్గురు రాష్ట్ర పత్యేక పరిశీలకులు వచ్చే వారం నుండి రాష్ట్రంలో పర్యటిస్తారని, ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తారన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version