అహంకారం ఓడిపోయింది! స్వయంకృతాపరాధ పరాజయం! TRS ఎప్పుడైతే BRS గా మారిందో అప్పటినుంచే ఓటమి దిశగా నడిచింది! కాంగ్రెస్ గెలుపు వారి ఓటు బలం ఏమాత్రం కాదు! కెసిఆర్ పై వ్యతిరేక ఓటు మాత్రమే! బీజేపీ మధ్యలో స్వీయ గోల్ వేసుకున్నా అనూహ్యంగా మెరిసింది! ఆ పార్టీ వెనకడుగు వేయకుంటే తెలంగాణ లో ఇంకా బలంగా తయారయ్యేది! MIM కు ముస్లింలే తొలిసారి చుక్కలు చూపించారు! మొత్తానికి అహంకారం ఓడిపోయింది!
ప్రజాస్వామ్యంలో నియంతలు నిలబడలేరు! ఓటర్లు టైం చూసుకుని సైలంట్ గా వాత పెట్టారు! తప్పు తెలుసుకోవడానికి కెసిఆర్ కు ఇదొక అవకాశం! కేటీఆర్ కు ఇదొక గొప్ప గుణపాఠం! ఈ ఐదేళ్లు ప్రతిపక్షం లో ఉండి పాఠాలు నేర్చుకోవడానికి డైనమిక్ లీడర్ కేటీఆర్ కు ఇది సరైన అవకాశం!
ఈ తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ కొందరికే పరిమితం అయ్యింది! హైదరాబాద్ లో అద్భుతంగా తాను నిర్మించిన సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి ఛాంబర్ లో ఎక్కువ కాలం కూర్చోవడానికి జనం ఒప్పుకోలేదు! కెసిఆర్ కు ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో! తెలంగాణ ఇక అందరిదీ! తెలంగాణ కోసం ఎందరో చేసిన బలిదానాలు మరిస్తే ఇలాగే ఉంటుంది! కర్మ ఫలితం ఇలాగే ఉంటుంది! అధికారం నెత్తికెక్కితే ఇంతే!
చివరి నిముషం వరకు కెసిఆర్, కేటీఆర్ తో పాటు నేను కూడా BRS మళ్ళీ అధికారం లోకి వస్తుందనే చెబుతూ వచ్చాం! కెసిఆర్ అయితే ప్రగతి భవన్ కు నిన్ననే వైట్ వాష్ కూడా చేయించారు! రేపు క్యాబినెట్ మీటింగ్ అని ధైర్యంగా ప్రకటించారు! ఆ గుండె ధైర్యమే నాతో పాటు కోట్లాది మందికి కెసిఆర్ అంటే ఇష్టం! కెసిఆర్ లాంటి నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడూ లేడు! ఆ అభిమానంతో పాటు కెసిఆర్ ఎలాగయినా చక్రం తిప్పుతాడనే నమ్మకం తోనే నేను చివరి వరకూ నమ్మాను! తీరా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ ను దాటేసింది! BRS, కాంగ్రెస్ రెండూ మేజిక్ ఫిగర్ చేరకుండా ఉంటే కెసిఆర్ లోపలి చాణుక్యుడు బయటకు వస్తాడనే నమ్మకం నాకు! అయితే ఇప్పుడు కూసాలు కదిలాయి! పగ్గాలు రేవంత్ చేతిలోకి వెళుతున్నాయి! ఇక ఈ ఐదేళ్లు కెసిఆర్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి! కేటీఆర్ మంచి పాఠాలు నేర్చుకుని రాటుదేలాలి! వారసత్వం కాదు వార్ లీడర్ అనిపించుకోవాలి!
జనాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు! ఎన్ని పధకాలు ఇచ్చినా సరైన న్యాయం కనిపించకపొతే ఎప్పుడు ఎక్కడ ఎలా వాత పెట్టాలో తెలుసు! అదే చేశారు తెలంగాణ ఓటర్లు! మాటలు కాదు చేతల్లో చూపించారు! ఉద్యమ పార్టీ ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి! చాలా మంచి పనులు చేసినా, అభివృద్ధి సంక్షేమం పై దృష్టి సారించినా అహంభావం వాటన్నిటిని తుడిచి పెట్టేసింది! ఇది ప్రజాస్వామ్యం గెలుపు! తెలంగాణ ఓటర్ల గెలుపు!
- డా. మహ్మద్ రఫీ