Home తెలంగాణ సీట్లు కోట్లకు సేల్..

సీట్లు కోట్లకు సేల్..

0

కాంగ్రెస్ లో నేతల కరువు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మా అభ్యర్థులు దూసుకుపోతున్నారు… మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తాం.కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులే లేరు ..పాత రంగారెడ్డి కలిపి 29 సీట్లు ..ఇక్కడ 25 చోట్ల అభ్యర్థులు లేరు..డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారు.


ఈ మధ్య కాంగ్రెస్ నేత ఒకాయన కలిశారు ..కూకట్ పల్లి సీట్ కోసం ఆయన్ను 15 కోట్ల రూపాయలు అడిగారట
గతం లో నేను చేప్పినట్టే కర్ణాటక లో అక్రమ డబ్బు జమఅవుతోంది. అక్కడ స్క్వేర్ ఫీట్ కు 500 వసూలు చేస్తున్నారు.. తెలంగాణ కు తరలించడానికి సిద్ధంగా ఉన్న 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికింది ..8 కోట్లు ఇదివరకే కొడంగల్ కు చేరినట్టు మాకు సమాచారం ఉంది.
మా కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా..నీతి ఆయోగ్ ,rbi రిపోర్టు ల అన్నీ సూచీల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది..ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి..

అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదు..అమిత్ షా మా పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి..ప్రధాని ఎక్కడికి పోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అని తిడుతారు.. ప్రధాని కి అంత అహంకారమా.
రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్..ఏమి రాసిస్తే అది చదువుతారు.

సీఎం కేసీఆర్ ఈ సారి కూడా వంద స్థానాల్లో ప్రచారం చేస్తున్నారు..నేను ghmc ,సిరిసిల్లా తో పాటు కామారెడ్డి ప్రచారం చేస్తాను..ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ లో స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నా
కాంగ్రెస్ 2004 ,2009 లలో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. మేము 95 శాతం వరకు మా మేనిఫెస్టో లోని హామీలు నిలబెట్టుకున్నాం.
ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించేది ప్రజలే ..అధికారులుకాదు
..కేసీఆర్ పాలన తీరు పైనే ప్రజలు తీర్పు ఇస్తారు ..మేము చేసింది చెప్పుకుంటాం..గతం లో వచ్చినట్టే మాకు 88 సీట్లు రావచ్చు. హుజురాబాద్ లో కూడా మేమే గెలుస్తున్నాం. ఈటెల రాజేందర్ గజ్వెల్ లోనే కాదు ఇంకా 50 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version