30 C
Vijayawada
Wednesday, October 30, 2024

చిన్నారులకు అందించే వ్యాక్సిన్ నేలపాలు.

Must read

  • వినుకొండ పట్టణం.

వైద్య ఆరోగ్యశాఖ చిన్నారులకు అందించే వ్యాక్సిన్ నేలపాలు.

వైద్య ఆరోగ్య శాఖ చిన్నారులకు అందించే వ్యాక్సిన్ నేల పాలవుతుంది. కొందరి నిర్లక్ష్యం భావితరాలకు శాపంగా మారుతుంది. మనదేశంలో 1978లో ఎక్స్‌పాండెడ్ ప్రొగ్రామ్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఈపీఐ)గా ప్రారంభమైంది.1989-90 నాటికి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంగా దశల వారీగా దేశమంతా చేపట్టారు. ఈ వ్యాక్సీన్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తారు. ప్రజలకు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉంటాయి. ఊళ్లల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గ్రామీణ ఆరోగ్య నర్సులు, హెల్త్ వర్కర్లు వ్యాక్సినేషన్ చేస్తారు.పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా ఇస్తారు.ప్రైవేటు ఆసుపత్రులలో కూడా ఇమ్యూనైజేషన్ వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉంటాయి. కానీ వాటికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఉచిత వ్యాక్సిన్ నేల పాలు

వినుకొండ పట్టణంలోని nsp కాలని నందు గల అర్బన్ ప్రైమరీ సెంటర్ నందు ఓ నర్సు చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్ తో పాటు కరోనా వ్యాక్సిన్ ను నెల పాలు చేస్తూ కంటపడింది. వైద్య ఆరోగ్య శాఖ చిన్నారులకు అందించే విలువైన వ్యాక్సిన్ ను ఆమె వృధా చేస్తుండటం చర్చనీయంసంగా మారింది. కాని ఈమె అంతటి విలువైన వ్యాక్సిన్ ఏ విధంగా నెల పాలు చేస్తుందో చూడవచ్చు. దీని పై వైద్య శాఖ అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఉచితంగా అందించే వ్యాక్సిన్లు

వ్యాక్సినేషన్లు ప్రాణాంతక జబ్బుల నుంచి చిన్నారులను కాపాడతాయి. అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి వ్యాక్సినేషన్లు ఇస్తారు. పిల్లలకు స్వతహాగా రోగనిరోధక శక్తి ఉండదు. తల్లే వారికి కావాల్సిన రోగనిరోధకశక్తిని తన శరీరం నుంచి అందిస్తుంది.పుట్టగానే పోలియో, బీసీజీలు ఇస్తారు. ఇవి కాకుండా ఎంఎంఆర్ తదితర మిగతా వ్యాక్సిన్లు క్రమపద్ధతిలో బిడ్డకు 0-10 సంవత్సరాల దాకా వారాలు, నెలలు, సంవత్సరాల వారీగా ఇస్తారు. పదేళ్లకు టైఫాయిడ్, కలరాలకు వ్యాక్సిన్లు ఇస్తారు. పుట్టగానే హెపిటైటిస్ బి వాక్సిన్ మూడు డోసులు ఇస్తారు. ఆడపిల్లలకు సర్వికల్ కాన్సర్ రాకుండా హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సీన్ ఇస్తారు. పలు దేశాలలో దీనిని యూనివర్సల్ వాక్సినేషన్ షెడ్యూల్లో చేర్చారు. కానీ మనదేశంలో దీన్ని ఇంకా వ్యాక్సినేషన్ జాబితాలో చేర్చలేదు. ఈ వ్యాక్సినేషన్‌ని 9-15 సంవత్సరాల మధ్య రెండు డోసులు ఇస్తారు. ఈ వయసులో వీళ్లల్లో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి. పదిహేనేళ్లు వస్తే మాత్రం శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందడం తగ్గిపోతుంది. కాబట్టి మూడు డోసులు ఇస్తారు. మలేరియా, డెంగ్యూలకు వ్యాక్సినేషన్ లేదు. నిజానికి వీటివల్ల చనిపోతున్నవారు ఎక్కువ మంది ఉంటున్నారు. మలేరియా వ్యాక్సినేషన్ ట్రయల్స్‌లో ఉంది. డెంగ్యూకి కూడా వ్యాక్సినేషన్ వస్తే చాలా ప్రాణాలు కాపాడినట్లవుతుంది. మందుల కన్నా వ్యాక్సినేషన్లు శక్తివంతంగా పనిచేస్తాయి. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకూ వచ్చే చాలా జబ్బులకు పారిశుద్ధ్యం, సురక్షిత నీరు, పరిశుభ్రత లోపాలతో పాటు కాలుష్యం, పర్యావరణ వినాశనం వంటివి కారణాలు. వీటివల్ల మనుషుల్లో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఈ పరిణామాలను ఇప్పటికే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనుషులను వచ్చే రకరకాల జబ్బుల నివారణకు వ్యాక్సీన్లు చాలా ముఖ్యం. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వాటికి కూడా వ్యాక్సినేషన్లు ఉన్నాయి.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article