27 C
Vijayawada
Wednesday, October 30, 2024

హాయ్ నాన్న సూపర్!

Must read

నాని సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి! మామూలు సినిమాలు చేయడు నాని! ఏదొక కొత్తదనం ఉంటేనే ఒప్పుకుంటాడు! హాయ్ నాన్న కూడా డిఫరెంట్ గా ఉంది! నాన్న గా సింగిల్ పేరెంట్ గా నాని బాగా చేశాడు!

కుమార్తె గా టిక్ టాక్ బేబీ స్టార్ కియారా ఖన్నా ఆకట్టుకుంది! సీతారామం లో క్లాసిక్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్ భార్య, ప్రేయసి పాత్రలో చక్కగా కుదిరి ఒదిగిపోయింది!

మంచి ఎమోషనల్ లవ్ సెంటిమెంట్ ఫ్యామిలీ సినిమా ఇది! చాలా రోజుల తరువాత ఫ్యామిలీ డ్రామా మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది! కొంచెం స్లోగా నడిచినా ఇబ్బంది అయితే పెట్టలేదు! సను జాను నర్గిస్ కెమెరా పనితనం బావుంది! ముఖ్యంగా సంగీతం అద్భుతం గా అందించాడు హేషం అబ్దుల్ వాహబ్! ఇతను రియాద్ లో పుట్టినా తెలుగు సినిమాలను బాగానే క్యాచ్ చేశాడు! విజయ్ దేవరకొండ ఖుషి తరువాత మళ్ళీ నాన్న కు అద్భుతంగా సంగీతం అందించాడు! బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కుదిరింది!

ముఖ్యంగా దర్శకుడు సౌర్యవ్ గురించి మాట్లాడుకోవాలి! అతనే కథ, మాటలు, దర్శకత్వం! సినిమా సంభాషణలు ఒక కవిత్వంలా సాగింది! హార్ట్ టచింగ్ డైలాగ్స్ అందించాడు! చిన్న చిన్న సంభాషనలతో సినిమా నడిపించిన తీరు ఆకర్షించింది! కట్ డైలాగ్స్ తో మరో త్రివిక్రమ్ అనిపించాడు!

క్లైమాక్స్ ట్విస్ట్ బావుంది! అలా ముగించడమే బావుంది! రొటీన్ కు భిన్నంగా దర్శకుడు సౌర్యవ్ ఆలోచించాడు అనిపించింది! అలా చేయడమే ఆ సినిమా కు హైలెట్! విరాజ్ (నాని) ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్! యష్ణ (మృణాల్ ఠాకూర్) ప్రేమ లో పడతాడు! యష్ణ పేరెంట్స్ ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం చిన్నప్పటి నుంచి చూసిన అనుభవించిన యష్ణ తన పెళ్ళి తరువాత పిల్లలు వద్దనుకుంటుంది! విరాజ్ ఆర్ధికంగా నిలదొక్కుకోలేదని యష్ణ తల్లి పెళ్ళికి అసలు అంగీకరించదు! అయినా ఎదిరించి విరాజ్ ను చేసుకుంటుంది! పిల్లలు కావాలంటాడు విరాజ్ ! చివరకు పాప కు జన్మనిస్తుంది! ఆ పాప పుట్టుక తోనే ఊపిరితిత్తుల్లో సిస్ట్స్ సమస్యతో పుట్టడం, బతకడం కష్టమని తెలిసాక యష్ణ డిప్రెషన్ కు లోనవుతుంది! విడాకులు తీసుకుందామనుకుని మౌనంగా మారిపోతుంది! విరాజ్, యష్ణ కారులో ఇంటికి వెళుతున్న సమయం లో కారు తీవ్ర ప్రమాదానికి గురి కావడం, యష్ణ తన గతాన్ని మరచిపోతుంది!

ఒకరోజు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురి కాబోతున్న పాపను కాపాడుతుంది! కానీ, ఆ పాప తన కుమార్తె అనే విషయం తెలియదు! అలా పాపకు దగ్గరై మళ్ళీ విరాజ్ ప్రేమ లో పడుతుంది! యష్ణ కు కోటేశ్వరుడైన డాక్టర్ తో పెళ్ళి ఫిక్స్ చేస్తుంది తల్లి ! ఆ పెళ్ళి జరుగుతుందా? తిరిగి విరాజ్ నే పెళ్ళి చేసుకుంటుందా? గతం గుర్తుకు వస్తుందా? ఆ పాప తన కుమార్తె అని తెలుసుకుంటుందా? ఇవన్నీ సౌర్యవ్ ఇచ్చిన ట్విస్ట్ లే! ఆ ట్విస్టులు చెబితే థ్రిల్ ఉండదు! చూస్తే మీకూ థ్రిల్ అనిపిస్తుంది! వీళ్లందరికి తోడు ఫ్లూటో డాగ్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ! పాటలు కూడా మంచి సాహిత్యం ఒదిగిన సంగీతం లో వినసొంపుగా అద్భుత టేకింగ్స్ తో చూడసుందరంగా ఉన్నాయి! చూడొచ్చు పరవాలేదు హాయిగా హాయ్ నాన్న!

  • డా. మహ్మద్ రఫీ
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article