30 C
Vijayawada
Wednesday, October 30, 2024

పరమ చెత్త ఎనిమల్!

Must read

బోల్డ్ అంటే ఇంత దారుణంగా తీస్తారా? ఇవేం డైలాగులు? అంత ఓపెన్ గా అన్నీ మాట్లాడేస్తే అది గొప్ప సినిమా అయిపోతుందా? ఏంటది? అర్జున్ రెడ్డి డోస్ పెంచినా హిట్ ఇచ్చారని హద్దులు మరచిపోయావా సందీప్ రెడ్డి! ఇంత అరాచకమా?

చిన్నప్పుడు తండ్రి సమయం ఇవ్వలేదని, వ్యాపారంలో బిజీ అయిపోయి బాల్యం లో అందుబాటులో లేడని కసి తో సైకో గా హీరోను మార్చావ్ సరే! ఆ సన్నివేశలేంట్రా సామి! ప్రేక్షకులకు ఎక్కడ లేని పిచ్చి ఎక్కించే ప్రయత్నం చేశావ్! మహిళలను గౌరవించడం తెలియదా? వాళ్ళ పై అంత ద్వేషం కక్కావేం?

మనిషి ఎంత జంతువు గా మారినా ఆ బట్టలు విప్పుకుని తిరగడం ఏమిటి? భార్యను వేధించి హింసించి జండూబామ్ రాయడం ఏమిటి? చెల్లెళ్ళ మీద పిచ్చి ప్రేమ తో ఉన్నట్లు చూపించావు సరే, ఆ ప్రేమలో దుర్మార్గుడైన బావ ను చంపేయడం ఏమిటి? మార్చే ప్రయత్నం చేయకుండా చంపేసి చెల్లిని ఇంకో పెళ్ళి చేసుకో అని ఓదార్చడం ఏమిటి?

అసలు ఒకేసారి హోటల్ లో 300 మందిని చంపడం హీరోయిజమా? అన్నీ అవయవాలు డ్యామేజ్ అయి కూడా హీరో బతకడం అంటే అది మన ఇండియన్ సినిమా అనుకో… అదే చూపించావు! మరీ అరాచకాలు, ఆ రక్తపాతాలు ఏమిటి? నీకయినా అర్ధమైందా? పైగా ఎడిటింగ్ కూడా నువ్వే చేసుకున్నావ్ హతాస్మి! అనవసర సీన్లు పెట్టి మూడు గంటలకు పైగా లాగి ఏం చెప్పాలనుకున్నావ్ సామి!

వ్యభిచారం, పిల్లలు పుట్టించే జీవితం ముస్లింలకే అంట గట్టాలని ప్రయత్నించావా ? పూజలు హోమాలు సంస్కృతిని కాపాడటం హిందువులకే సాధ్యం అని చెప్పి మార్కులు కొట్టేసి జాతీయ పురస్కారాలు దోచేసుకుందాం అనుకున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశ్యం?!

అసలు నీ దృష్టిలో భారతీయ మహిళ అంటే సెక్స్ టాయ్ అనుకున్నావా? భార్యను పిలిచి పని మనుషుల ముందే బట్టలు తీయమని అనడం, ఆమె తీసేయడం ఏమిటసలు? ఉంచుకున్న దాని రెండు కాళ్ళ మధ్య పడుకుని న్యూడ్ గా చూపించడం ఏమిటి? నిజమే ఇవన్నీ ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉండొచ్చు! కానీ నువ్వొక క్రెజీ స్టార్ ను పెడితే చాలా మంది ఫ్యామిలీ తో సినిమాలు చూస్తారనే జ్ఞానం కూడా లేదా రెడ్డి? బ్రా స్ట్రిప్ లాగుతూ హింసించడం ఏమిటి?

నీ తండ్రిని నీ కజిన్ చంపే ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకోవడానికి 300 మందిని చంపేస్తావా? నీ చెల్లిని ర్యాగింగ్ చేసాడని కారుతో అందరిని గుద్దేస్తావా? అసలు ఆ కళ్ళల్లో కసకస పొడవడేమిటి? ఆ రక్తం తోనే అందరి ముందు సోఫా లో ఫస్ట్ నైట్ ఏమిటి? అరబ్ దేశాల్లో జరుగుతాయేమో కానీ, అందులో పాత్రలన్ని ఇండియన్స్! అంత ఘోరం ఉండదురా బాబు! రెండు కత్తులు పట్టుకుని నీ కజిన్స్ ఇద్దరినీ ఖైమా చేసేసావ్! మటన్ షాప్ లో కూడా అలా ఖీమా చేయరనే విషయం తెలుసా నీకు? అది నీ మనస్తత్వం సరే, ఆ కత్తులతోనే వచ్చి వదినా భయపడకు, నేను పెళ్ళి చేసుకుంటాను అంటావా? ఇదేనా వదిన కు ఇచ్చే గౌరవం? ఫ్లైట్ పైలట్ లేకుండా తిరగడం ఏమిటో! అందులో ఫస్ట్ నైట్ సెట్ చేసేయడం నీకే చెల్లిందిలే!

యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు అనే కన్నా జీవించేలా చేశావ్! అది నీ దర్శక ప్రతిభ కావచ్చు! నేను మాట్లాడుతున్నది కంటెంట్ గురించి! నా అభ్యంతరం అంత కంటెంట్ గురించే రెడ్డి!

సమాజాన్ని కూల్చే పరమ చెత్త సినిమా ఇది! డిశాస్టర్ మూవీ ఇది! తెలుగు వాడు, వరంగల్ వాడు పాన్ ఇండియా మూవీ తీశాడు అని సంతోషం లేకుండా చేసేసావ్! సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నావ్! ఓటీటీ లో ఇలాంటివి బోలెడు వస్తాయి! అలా రిలీజ్ చేసుకోవాల్సింది! పెద్ద పెద్ద స్టార్స్ ను పెట్టి ఇంత బోల్డ్ గా తీసి ఏం సాధించాలనుకున్నావ్?

It’s a disaster movie for the youth of India where emotions have been assaulted and named n hyped as excellent.

  • డా. మహ్మద్ రఫీ
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article