30 C
Vijayawada
Wednesday, October 30, 2024

ఒకరికొకరుగా..

Must read

శ్రీలంకకు భారత్ సాయం..

75 రవాణా బస్సులు అందజేసిన ఇండియా

సొంతమేలు కొంత మానుకుని తోటివాడికి తోడుగా నిలవాలనే సదుద్దేశ్యంతో ముందుకు సాగుతోంది భారతదేశం. గత సంవత్సరం తీవ్ర ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయి ప్రపంచదేశాలకు ఒక గుణపాఠంలా మిగిలింది శ్రీలంక. శ్రీలంక ఎదుర్కొంటున్న సమస్యల ను చూసి ప్రపంచపటం నివ్వెరపోయింది. ఒకింత ఉలికిపాటుతో అప్రమత్తం అయింది కూడా. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టుగా నిర్వచించింది శ్రీలంక సంక్షోభం. కోవిడ్ మానవసంబంధాల విలువను తెలియచేస్తే శ్రీలంక ఆధునికత.. ఆర్భాటజీవనం ఎంత ముప్పును తీసుకువస్తుందో ఛర్నాకోలులా చరిచిమరీ హెచ్చరించింది. అయితే ఈ క్రమంలో భారతప్రభుత్వం పొరుగువారికి అండగా నిలబడాలనే సూత్రంతో స్నేహభావంతో ముందుకు అడుగులు వేస్తోంది. వివిధ రకాలుగా చేయూతను అందిస్తోంది. ఆ వివరాలు మీకోసం…

శ్రీలంక: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసిన శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ తనవంతుగా సాయం చేస్తూనే ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా సాయం చేసిన ఇండియా తాజాగా మరోసారి సహాయం చేసింది.శ్రీలంకకు 75 ప్రజా రవాణా బస్సుల్ని అందజేసింది.శ్రీలంకలో రవాణా వ్యవస్థని మెరుగుపర్చే ఉద్దేశంతో ఈ పని చేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని అక్కడి అధికారులకు అందజేశారు.

మొత్తం 500 బస్సుల్ని అందజేయాలని భారత్ నిర్ణయించింది. మిగతా బస్సుల్ని కూడా దశలవారీగా అందిస్తారు. గత మేలో తమ దేశం దివాళా తీసినట్లు శ్రీలంక ప్రకటించింది. అప్పట్నుంచి ఇండియా అనేక రకాలుగా శ్రీలంకకు సాయం చేస్తోంది.’నైబర్‌హుడ్ ఫస్ట్ (పొరుగు దేశాలకే మొదటి ప్రాధాన్యం)’ అనే విధానం కింద శ్రీలంకకు ఇండియా సాయం చేస్తోంది. శ్రీలంక పోలీసులకు గత డిసెంబర్‌లో 125 ఎస్‌యూవీలు అందజేసింది.అక్కడ సరైన వాహనాలు లేకపోవడంతో పోలీసులు పని చేయడం కూడా కష్టమవుతోంది. అందుకే ఇండియా వీటిని అందజేసింది.

అంతకుముందు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత 900 మిలియన్ డాలర్ల రుణం అందజేసింది. శ్రీలంక దగ్గర చమురు కొనేందుకు కూడా డబ్బులు లేవు.దీంతో శ్రీలంక చమురు కొనేందుకు 500 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత దీన్ని 700 అమెరికన్ డాలర్లకు పెంచింది.భారత్ అందించిన సాయాన్ని అత్యవసర వస్తువులు, చమురు కొనేందుకు వినియోగించుకుంటోది శ్రీలంక.ఇప్పుడిప్పుడే శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.వివిధ దేశాలు శ్రీలంకకు ఆర్థిక సాయం అందజేస్తున్నాయి.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article